ఆవుతో బెడ్‌రూమ్‌లోకి దూరిన ఎద్దు.. ఊహించని ఘటనతో ఫ్యామిలీ షాక్

ఒక్కోసారి కొన్ని ఊహించని సంఘటనలు షాక్‌కు గురి చేస్తుంటాయి. ఫన్నీగా కూడా ఉంటాయి. అలాంటి సంఘటనే హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగింది. ఇది ఒక అసాధారణ సంఘటననే చెప్పొచ్చు. ఒక ఇంట్లో ఇద్దరు అనుకోని అతిథులు దూరడంతో ఆ ఫ్యామిలీ షాక్‌ అయింది. ఆ అనుకోని అతిథులు ఎవరో కాదు.. ఒకటి ఆవు అయితే మరొకటి ఎద్దు. ఏకంగా బెడ్‌రూమ్‌లోకి దూరేశాయి. మంచం ఎక్కి గంట సేపు అక్కడే గడిపాయి. ఫరీదాబాద్‌ NIT ప్రాంతంలో డబువా కాలనీలో జరిగిందీ సంఘటన.