ఇతర దేశాల జోక్యాన్ని ఆమోదించమని అమెరికా, జర్మనీకి ఇప్పటికే భారత్ వార్నింగ్ - Tv9

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఇప్పటికే జర్మనీ, అమెరికా స్పందించగా, తాజాగా ఐక్యరాజ్య సమితి స్పందించింది. కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారాన్నీ అమెరికా ప్రస్తావించింది. దీనిపై భారత్‌ తన వైఖరిని స్పష్టం చేసింది. ఇవి పూర్తిగా దేశ అంతర్గత విషయాలని.. దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలని దీటుగానే బదులిచ్చింది. ఈ విషయంలో ఇతర దేశాల జోక్యాన్ని ఏమాత్రం ఆమోదించబోమని తేల్చి చెప్పింది.