సృష్టిలోని ప్రతిమనిషీ అందంగా ఉండాలని కోరుకుంటారు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఎంతచేసినా అది కొన్ని రోజులు లేదా సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. కొన్నాళ్లకి దానికి ఎక్స్‌పైరీ డేట్ వస్తుంది. అందం కాస్తా వాడిన పువ్వులా మారిపోతుంది. ఇది అందరికీ తెలిసిన అంగీకరించలేని సత్యం. అయినా కొందరు అందంగా లేరనో, రంగు విషయంలోనో అవతలి వ్యక్తులను చిన్నచూపుచూస్తారు.