పారిశ్రామికీకరణకు గ్లోబల్ వార్మింగ్ తదితరాలు తోడై గ్లేసియర్ల ఉసురు తీస్తున్నాయి. ఏటా రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల దెబ్బకు భూమ్మీద మంచు నిల్వలు శరవేగంగా కరిగి నీరైపోతున్నాయి. ఫలితంగా 1976 నుంచి 8,200 గిగా టన్నుల మంచు మాయమైపోయినట్టు కోపర్నికస్ వాతావరణ సేవల విభాగం (సీ3ఎస్) తేల్చింది.