టేకాఫ్ సందర్భంగా విమానం ఇంజెన్ కవర్ ఊడిపోయిన ఘటన అమెరికాలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. డెన్వర్ నుంచి టేకాఫ్ సందర్భంగా సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం ఇంజెన్‌పై ఉండే కవర్ అకస్మాత్తుగా ఊడిపోయింది. కొంత భాగం రెక్కలను కూడా ఢీకొంది. ఇది గమనించిన పైలట్ వెంటనే విమానాన్ని సురక్షితంగా విమానాశ్రయంలో దింపేశారు.