అమెరికాలో అక్రమంగా ప్రవేశించడానికి సహకరిస్తే రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ముట్టజెప్పడానికి కొందరు గుజరాతీలు సిద్ధమైన వైనం బయటపడింది. 303 మంది ప్రయాణికులతో నికరాగువా వెళుతున్న ఓ అద్దె విమానాన్ని వారం రోజుల క్రితం ఫ్రాన్స్‌లో నిలిపివేశారు. వారిలో 260 మంది భారతీయులు కాగా, అందులోనూ 66 మంది గుజరాత్‌కు చెందినవారు. ఫ్రాన్స్‌లో నాలుగు రోజులు చిక్కుకుపోయిన వారి విమానం డిసెంబరు 26న ముంబయికి తిరిగొచ్చింది.