ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత అసహనం..రూ.కోటి నష్టంపై.. జస్ట్‌ ఆస్కింగ్ అంటూ పోస్ట్‌

నటుడు ప్రకాశ్‌ రాజ్‌ పై ఓ నిర్మాత అసహనం వ్యక్తం చేశారు. ప్రకాశ్‌ రాజ్‌ వల్ల రూ.కోటి నష్టం ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రకాశ్‌రాజ్ స్టైల్‌లోనే #జస్ట్‌ ఆస్కింగ్‌ అంటూ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. తమిళనాడు ఎంపీ తిరుచ్చి శివ రచించిన ఐదు పుస్తకాల ఆవిష్కరణ శనివారం చెన్నైలో జరిగింది. ముఖ్యమంత్రి స్టాలిన్‌, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌తోపాటు ప్రకాశ్‌రాజ్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.