ఎస్సై చేసిన పొరపాటు.. మహిళ తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్

ఓ పోలీసు అధికారి పొరపాటు మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌ కోసం కుమారుడితో కలిసి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన మహిళ ఊహంచని విధంగా ప్రమాదంలో పడింది. పోలీసు అధికారి తుపాకి శుభ్రం చేస్తుండగా పొరపాటున అది పేలి బుల్లెట్‌ నేరుగా అక్కడ నిల్చుని ఉన్న మహిళ తలలోకి దూసుకెళ్లింది.