ఇప్పటి వరకూ మనకు పాము, తేలు లాంటివి కరిస్తే మంత్రం వేయడం గురించి విన్నాం. కానీ కుక్క కాటుకి కూడా మంత్రం వేసేస్తున్నాడు ఓ వ్యక్తి. పెద్దపల్లి జిల్లాలో ముస్తాక్ అనే వ్యక్తి కుక్కకాటుకు మంత్రం వేసి ఇచ్చే, నీళ్లు తాగితే రేబిస్ రాదని చెబుతున్నాడు. అంతేకాదు.. ముందు జాగ్రత్తగా ఆస్పత్రికి కూడా వెళ్లమంటూ సలహా ఇస్తున్నాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లిపూర్ గ్రామంలో ఇక్కడ కుక్క కరిస్తే ఇప్పటికీ మంత్రాన్ని నమ్ముతున్నారు.