రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే కాన్సెప్ట్ వీడియోను విడుదల చేసి ఓ ప్రెస్ మీట్ ను నిర్వహించనున్నారు మూవీ టీమ్.