పంజాబ్‌లోని మాధోపూర్, సిర్హింద్ సమీపంలో రెండు గూడ్స్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రైలులోని ఇద్దరు డ్రైవర్లు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు, రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది.