అక్టోబర్ లో పెట్రోల్ , డీజిల్ అమ్మకాలు ఎందుకు తగ్గాయి @Tv9telugudigital

అక్టోబరు నెలలో దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలు పడిపోయాయి. అక్టోబరు 1 నుంచి 15వ తేదీ మధ్యకాలంలో వీటి అమ్మకాలు బాగా తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వ రంగంలోని మూడు చమురు సంస్థల గణాంకాల ప్రకారం.. గతేడాది అక్టోబర్‌ 1 నుంచి 15 వరకూ జరిగిన అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబరు తొలి అర్ధ భాగంలో పెట్రోల్‌ విక్రయాలు 9 శాతం క్షీణించి 1.17 మిలియన్‌ టన్నులుగా ఉంది. డీజిల్‌ అమ్మకాలు 3.2 శాతం తగ్గి 2.99 మిలియన్‌ టన్నులకు చేరింది.