అదిరిపోయింది పో టీజర్ .. బ్రహ్మరాక్షసుడు వచ్చేశాడు.. Gopichand Bheema - Tv9 Et

కటౌట్‌ మాత్రమే కాదు.. ఊర మాసు క్యాలిబర్ కూడా ఉన్న గోపీచంద్.. మరో సారి గూస్ బంప్స్‌ తెప్పించే రేంజ్లో బయటికి వచ్చాడు. రాక్షసులను వేటాడే బ్రహ్మ రాక్షసుడికా.. రీసౌండ్‌ చేస్తున్నాడు. దిట్టంగా బలిసిన ఒంగోళు గిత్త మీద... పోలీసు యూనిఫాంలో రౌద్రంగా... బరిలోకి దిగేశాడు. టీజర్‌తోనే సెన్సేషనల్ అయిపోతున్నాడు. ఆఫ్టర్ చిన్న బ్రేక్.. గోపీచంద్ హీరీగా.. ఏ. హర్ష డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఫిల్మ్ భీమ. ఫస్ట్ లుక్‌ దగ్గర నుంచే క్రేజీ ప్రాజెక్ట్ గా టర్న్‌ అయిన ఈసినిమా నుంచి తాజాగా ఓ టీజర్ రిలీజ్ అయింది. ఆ టీజర్ ఇప్పుడు చూస్తున్న వారికి గూస్ బంప్స్‌ తెప్పిస్తూనే.. అటు యూట్యూబ్‌ను.. ఇటు సోషల్ మీడియాను షేక్ అయ్యేలా చేస్తోంది. దాంతో పాటే.. గోపీచంద్‌కు ఈ సారి హిట్ పక్కా అనే టాక్ కూడా.. నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తోంది.