టాలీవుడ్ ఆడియన్స్ మనసులో నిలిచిపోయిన అందమైన ప్రేమకథలలో ఆర్య ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇది. 2004లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. స్టోరీ కొత్తగా ఉండడం, పాటలు మరింత అద్భుతంగా ఉండడంతో ముఖ్యంగా యూత్ ఈ సినిమాకు ఎక్కువగా కనెక్ట్ అయింది. ఇప్పటికీ ఈ సినిమాకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు.