క్రికెట్ మ్యాచ్ లో రెండు సార్లు టాస్ ..ఎప్పుడైనా చూశారా విన్నారా

ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ జరుగుతోంది. క్రికెట్ ప్రపంచంలో ఈ లీగ్ చర్చనీయాంశమైంది. IPL తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్ ఏదైనా ఉందంటే అది BBL మాత్రమే. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సాధారణంగా కనిపించని సంఘటన జరిగింది. టాస్ సమయంలో ఓ వింత చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో రెండుసార్లు టాస్ చేయాల్సి వచ్చింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయి పెద్దగా నవ్వడం మొదలుపెట్టారు. కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్‌లో టాస్‌కు సిడ్నీ థండర్ కెప్టెన్ క్రిస్ గ్రీన్, బ్రిస్బేన్ హీట్ కెప్టెన్ కోలిన్ మున్రో వచ్చారు. ఈ మ్యాచ్‌లో సిడ్నీ కెప్టెన్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.