కోలీవుడ్ సీనియర్ హీరో.. డీమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు విజయ్‌కాంత్ అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 28న చెన్నైలోని మియాత్ ఆసుపత్రిలో తుదిశ్వస విడిచారు. ఆయన మరణం సినీ పరిశ్రమలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర విషాదం నింపింది. నటీనటులు, రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు విజయకాంత్ భౌతికకాయానికి ప్రత్యక్షంగా నివాళులు అర్పించారు.