భూతల స్వర్గం జమ్మూకశ్మీర్ మంచు గుప్పిట్లో చిక్కుకుంది. అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. దాంతో అక్కడి సరస్సులు, కొలనుల్లోని నీరు గడ్డకట్టింది. శ్రీనగర్‌లో ఉష్ణోగ్రతలు మైనస్ 4 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయినట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని దాల్ సరస్సు పూర్తిగా గడ్డ కట్టుకుపోయింది. అది చూసి స్థానికులు, పర్యాటకులు తెగ మురిసిపోతున్నారు. గడ్డకట్టి నదిపై అటూ ఇటూ నడుస్తూ పర్యాటకులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే అదే సమయంలో తీవ్ర మైన చలి కారణంగా వారికి ఇబ్బందులు కూడా తప్పడం లేదు.