ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు చివరి దశకు చేరాయి.నిన్న సాయంత్రానికి అందర్నీ రక్షిస్తామని అధికారులు ప్రకటించారు కాని.. అది కుదరలేదు.. తవ్వకాల సమయంలో శిథిలాలు అడ్డు రావడంతో సహాయక చర్యలకు ఆటకం ఏర్పడింది. అయితే చిన్న సొరంగాన్ని డ్రిల్ చేస్తున్న సమయంలో.. మిషనరీ ఓ ఇనుమ మెష్‌లోకి దూసుకెళ్లింది. నిజానికి ఈ ఐరన్ లాటిస్ గిర్డర్‌ని డ్రిల్లింగ్ మెషీన్ల ద్వారా తీయాలని చూస్తే.. పెను ప్రమాదం తప్పదు.