భారతీయులు విదేశాల్లో ఉన్నత పదవులే కాదు, జాక్‌పాట్‌లూ కొడుతున్నారు. ఎందరో విదేశాల్లో లాటరీల ద్వారా లక్షాధికారులు, కోటీశ్వరులు అయ్యారు. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో తమిళనాడుకు చెందిన మాగేష్ కుమార్ నటరాజన్ అనే వ్యక్తి ఏకంగా 16 కోట్ల లక్కీ లాటరీ గెలుచుకున్నారు. అతను 25 ఏళ్లపాటు ఆ జాక్‌పాట్ మనీని అందుకోనున్నారు.