హైదరాబాద్‌కు భూగర్భజల నీటి కరువు ముప్పు ముంచుకొచ్చింది. అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్ మహానగరంలో అంతకు రెట్టింపు స్థాయిలో భూగర్భ జలాలు కూడా అడుగంటి పోతున్నాయి. తాజా సర్వేనే అందుకు నిదర్శనం. ఔటర్ రింగ్ రోడ్డు వరకు దాదాపు 948 చదరపు కిలోమీటర్లలో సాంకేతిక నిపుణులతో జలమండలి జరిపిన సర్వేలో కేవలం 27 చదరపు కిలోమీటర్లు మినహా, మిగిలిన 921 చదరపు కిలోమీటర్లలో భూగర్భ జలాలు ప్రమాద స్థాయిలో అడుగంటిపోయినట్లు నివేదిక సమర్పించారు.