పిల్లలు ఆడుకునే క్రమంలో చేతికి దొరికిన ప్రతి వస్తువునూ నోటిలో పెట్టుకుంటుంటారు. అలాంటప్పుడు పొరపాటున వాటిని మింగేస్తుంటారు. ఈ సందర్భాల్లో ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. తాజాగా ఓ బాలుడు ఆడుకుంటూ ఇనుప తాళం కప్పను మింగేశాడు. వెంటనే వైద్యులను సంప్రదించడంతో పెను ప్రమాదం దప్పింది. ఖమ్మం నగరానికి చెందిన మహ్మద్ మహాయజ్ అనే ఐదేళ్ల బాలుడు తాళం కప్పను నోట్లో పెట్టుకుని ఆడుకుంటున్నాడు.