సాయంత్రం వేళలో... మల్లారెడ్డి కాలేజ్ గ్రౌండ్.. వేలల్లో జనం.. పండగ వాతావరణం... కట్ చేస్తే... ఈవెంట్ స్టార్ట్ అయి కొద్ది సేపటికీ.. బిజినెస్ మ్యాన్ కమ్ ఎమ్మెల్యే.. మల్లారెడ్డి స్పీచ్ మొదలెట్టారు. అయితే అలా మొదలెట్టడమే ఆలస్యం... అందరికీ అడ్డంగా దొరికిపోయారు. ఆ కారణంగా నెట్టింట తెగ ట్రోల్ అవుతున్నారు. ఇంతకీ పప్పులో కాలేసేంత ఏం చేశారని అంటారా? మరేం లేదు రష్మికను... రషీదాగా మార్చేశారు. చూశారుగా... తన కాలేజీ గ్రౌండ్‌లో జరుగుతున్న యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు.. వన్ ఆఫ్ ది చీఫ్ గెస్ట్‌గా విచ్చేసిన మల్లా రెడ్డి.. తన స్పీచ్ మొదట్లో... యానిమల్ టీంను పేరు పేరునా అడ్రెస్ చేశారు.