Viral మత్స్యకారుల వలలో డేంజరస్ పాము - Tv9

విశాఖ సాగర తీరంలో ప్రమాదకర పాము కలకలంరేపింది. నగర పరిధిలోని సాగర్‌నగర్‌ సముద్ర తీరంలో మత్స్యకారుల వలకు మంగళవారం ఓ విషపూరిత పాము చిక్కింది. చేపలతో పాటూ వలలో ఈ పామును మత్స్యకారులు గుర్తించారు. ఆహార అన్వేషణలో భాగంగా చేపల గుంపుల్లో కలిసిపోయిన సందర్భాల్లో ఇవి వలల్లో చిక్కుకుంటాయని తెలిపారు. సుమారు ఏడు అడుగులు పొడవు ఉన్న ఈ పామును మత్స్యకారులు తిరిగి సురక్షితంగా సముద్రంలోకి విడిచిపెట్టారు.