తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం కరోనావైరస్ మళ్లీ కలవరపెడుతోంది. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కేసులు.. మరణాలు కలవరపెడుతున్నాయి. తాజాగా.. తెలుగు రాష్ట్రాల్లో సైతం కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. చాప కింద నీరులా విస్తరిస్తోన్న కరోనా మహమ్మారి ఇద్దరిని బలి తీసుకుంది. తాజాగా.. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వాస్తవానికి వీరిద్దరూ అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చేరారు.