అంతరిక్షంలోకి రోబో స్నేక్ .. భారత సంతతి ఇంజనీర్ ఆవిష్కరణ - Tv9

భారత సంతతికి చెందిన ఎందరో ప్రతిభావంతులు విదేశాల్లో విజయపథంలో దూసుకుపోతున్నారు. అందుకు మరో ఉదాహరణ ఈ ఘటన. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఓ వినూత్న రోబోను పరీక్షిస్తోంది. పామును పోలి ఉండే ఈ రోబోను... చంద్రుడు, అంగారక గ్రహంపై పలు పరిశోధనల కోసం ఉపయోగించనున్నారు. భారత్‌లో కనిపించే కొండచిలువ ఆకారం, అది కదిలే తీరును స్ఫూర్తిగా తీసుకొని దీన్ని రూపొందించారు. భారత సంతతికి చెందిన ఓ ఇంజనీర్‌ అద్బుతమైన ఆలోచన అమెరికాలో కార్యరూపం దాల్చుతోంది.