మెగా కాంపౌండ్ నుంచి హీరోగా పరిచయమై తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి ధరమ్ తేజ్. సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే బైక్ యాక్సిడెంట్ కారణంగా ఆసుపత్రి పాలయ్యాడు. కోమా వరకు వెళ్లి వచ్చాడు. అయితే అంతే వేగంగా కోలుకుని.. తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. విరూపాక్ష సినిమాతో 100 కోట్ల క్లబ్‌లోకి కూడా చేరిపోయాడు. కానీ సర్‌ప్రైజింగ్‌లీ సినిమాలకు కాస్త గ్యాబిచ్చాడు. అయితే ఉన్నట్టుండి.. ఓ ఇంటర్వ్యూ కారణంగా.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు ఈ హీరో.