ఒకప్పుడు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసీ..చేసీ... చివరకు నిరాశే ఎదురు కావడంతో తీవ్ర నిర్ణయాలు తీసుకునేవారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడేవారు. ప్రస్తుతం యువత ఆలోచనా విధానం మారింది. అందుకు ఉదాహరణ ఈ ఖమ్మం జిల్లా యువకుడు. ఉద్యోగం రాలేదని నిరాశ పడకుండా తనకాళ్లపై తాను నిలబడే ప్రయత్నం చేశాడు. తనలాంటి ఎందరికో స్పూర్తిగా నిలిచాడు. ఖమ్మంజిల్లా కొణిజెర్ల మండలం తనికెళ్లకు చెందిన సందీప్ అనే యువకుడు ఉన్నత చదువులు చదువుకున్నాడు. ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు.