మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజున బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. చెర్రీ అభిమానుల ఎదురు చూపులకు తెర దించుతూ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘RC16’ ఫస్ట్ లుక్ విడుదల చేసారు. చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి విషెస్ చెప్పింది. లాంగ్ హెయిర్.. గుబురు గడ్డంతో ఉన్న సరికొత్త లుక్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. అలాగే ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలిపింది.