'అంతా మా భాగ్యం..' చేతులెత్తి మొక్కుతున్న మహేష్ ఫ్యాన్స్ Hanuman Prashanth Varma - Tv9 Et

అప్పట్లో రాముడంటే.. ఎన్టీఆరే కానీ.. ఈ జనరేషన్లో రాముడంటే మాత్రం.. ఎందుకో మహేష్‌ బాబు ఫేసే గుర్తొస్తుంటుంది అందరికీ..! కోల ముఖం.. కొచ్చటి ముక్కు.. తియ్యని నవ్వు.. ! ఈ ఫీచర్స్‌తో కనిపించే మహేష్‌ రాముడి క్యారెక్టర్‌కు సూట్ అవుతారనే మాట కూడా.. టాలీవుడ్ మేకర్స్‌ నుంచి చాలా సార్లు బయటికి వచ్చింది. అయితే ఒక్క డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నుంచి మాత్రం.. మాటే కాదు.. కార్యం కూడా మొదలైపోయింది. మహేష్ను రాముడిగా చూపించాలనే తన ప్రయత్నం ఎట్ ప్రజెంట్ ఓ రేంజ్‌లో సాగుతోంది. ఇప్పుడిదే అంతటా హాట్ టాపిక్ అవుతోంది.