ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఉన్నతచదువులు, లేదా ఉద్యోగం కోసం ఇతర దేశాలకు వెళ్లేవారు పాస్ పోర్ట్ చేయించుకోవాలంటే విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు విజయవాడలోనూ పాస్‌పోర్ట్ పొందే అవకాశం అందుబాటులోకి రానుంది. అవును, 2024 జనవరి నుండి విజయవాడలో ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం ప్రారంభించనున్నారు.