బర్త్‌ డే రోజు.. భార్యకు సూపర్ విషెస్‌ Manchu Manoj

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గతేడాది పెళ్లి చేసుకున్నాడు. ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈ ఏడాది తండ్రిగా ప్రమోషన్ కూడా కొట్టేశాడు. వారి వైవాహిక బంధానికి ప్రతీకగా మంచు మనోజ్- మౌనిక దంపతులకు పండంటి కూతురు జన్మించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ జంట తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. ఆ తర్వాత తమ గారాల పట్టికి ఘనంగా బారసాల నిర్వహించారు.