కోనసీమ జిల్లాలో 80 హస్తాలతో అరటి గెల

కోనసీమ జిల్లా మల్కిపురం మండలం దిండి గ్రామంలో బాహుబలి అరటి గెల అందర్నీ ఆశ్చర్యం గురిచేస్తోంది. సాధారణంగా అరటి గెలకు ఐదు నుండి ఎనిమిది హస్తాలు ఉంటాయి. కానీ దిండి గ్రామ సర్పంచ్ ముదునూరి శ్రీనివాస్ రాజు పెరట్లో ఓ అరటి గెల మాత్రం అబ్బురపరుస్తుంది.