టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ 2021 డిసెంబర్ లో విడుదల కానుంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ క్రేజీ మూవీ విడుదలై మూడేళ్లు గడుస్తోంది. దీంతో ఈ సినిమా సీక్వెల్ పుష్ప 2 ది రూల్ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ అంతకంతకు ఆలస్యమవుతోంది. ఇక మేకర్స్ అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఆగస్ట్ 15న పుష్ప 2 సినిమా విడుదలయ్యేది. అయితే ఈ సినిమా విడుదల తేదీని డిసెంబర్‌కి మార్చారు. అయితే ఇప్పుడు డిసెంబర్ లో కూడా పుష్ప సీక్వెల్ రావడం కష్టమని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్‌ను హైరానా పడేలా చేస్తున్నాయి.