వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..

సాధారణంగా పాములు.. తోటలు, అటవీ ప్రాంతాల్లో చీమలు ఏర్పరచిన పుట్టల్లో నివసిస్తూ ఉంటాయి. కానీ ఓ నాగుపాము ఏకంగా ఓ ఇంట్లోని పెద్ద పుట్టలో నివసిస్తూ స్థానికులతో పూజలందుకుంటోంది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని వెంగళరావు నగర్ కాలనీలో జనావాసాల మధ్య ఉంటోంది ఓ సర్పం. ఓ ఇంటిలో ఏర్పడిన పుట్టలో చేరింది. మొదట్లో ఆ పుట్టను తొలగించాలని ఆ ఇంటివారు, స్థానికులు ప్రయత్నించినా వారివల్ల కాలేదట. దాంతో ఇక ఆ పుట్టను కదల్చకుండా నాగదేవతే తమ ఇంట కొలువైందంటూ పూజలు చేస్తున్నారు.