పక్కా ప్లానింగ్ తో ఎగ్జిక్యూట్ చేసిన తాత - Tv9

లాల్​మదేసర్​ గ్రామంలో గ్రామ పెద్దగా సూర్జారామ్​ గోదారా ఉన్నారు. సూర్జారామ్​ వారసులంతా ఉమ్మడి కుటుంబంగా నివసిస్తున్నారు. అయితే ఆ కుటుంబంలో పెళ్లికి ఎదిగిన సూర్జారామ్​ మనుమళ్లు, మనుమరాళ్లు 17మంది ఉన్నారు. వీరందరికీ విడివిడిగా వివాహం జరిపించడం ఖర్చుతో కూడుకున్న పని అనుకున్నారో ఏమో కానీ, అందరికీ ఒకేసారి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు.