వాళ్లందరూ సినిమా చూశాకే నిర్ణయం.. Rgv వ్యూహానికి బ్రేక్ - Tv9

రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వ్యూహం సినిమా పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది.. ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ టిడిపి జనరల్ సెక్రెటరీ నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ని విచారించిన తెలంగాణ హైకోర్టు మొదట ఈ సినిమాపై ఈనెల 11 వ తారీకు వరకు స్టే విధించింది. తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వ్యూహం చిత్ర యూనిట్ డివిజన్ బెంచ్ లో అప్పీల్ కు వెళ్ళింది.