హాలోవీన్ పండుగను అమెరికా, యూరోప్ దేశాల్లో సరదాగా జరుపుకుంటారు. ఇప్పుడు భారత్‌లోనూ ఈ ఉత్సవం క్రేజ్ కనిపిస్తోంది. ఈ ఉత్సవంలోని ప్రత్యేకత ఏంటంటే ఇందులో పాల్గొనే జనం దెయ్యాల మేకప్ వేసుకుని ఇతరులను భయపెడుతూ రోడ్లపై తిరుగుతారు. ఒకరికొకరు బహుమతులు లేదా చాక్లెట్లు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ పండుగను ప్రతి సంవత్సరం అక్టోబర్ 31 న జరుపుకుంటారు.