ప్రస్తుతం దేశం మొత్తం ఒకే సినిమా గురించి మాట్లాడుకుంటుంది. థియేటర్లలో అస్సలు పట్టించుకోని జనాలు.. ఇప్పుడు ఓటీటీలో వెతికి మరీ చూస్తున్నారు. దీంతో డిజిటల్ ప్లాట్ ఫాంపై అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తుంది. అదే '12th ఫెయిల్' ఫిల్మ్. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ, ఐఆర్ఎస్ ఆఫీసర్ శ్రద్ధా జోషిల జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు బాలీవుడ్ డైరెక్టర్ విధు వినోద్ చోప్రా. ఇందులో విక్రాంత్ మాస్సే, మేధా శంకర్, అనంత్ విజయ్ జోషి ప్రధాన పాత్రలు పోషించారు. గతేడాది అక్టోబర్ 27న బాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలైన ఈ సినిమాకు అంతగా ఆదరణ లభించలేదు. కానీ పాజిటివ్ రివ్యూస్ మాత్రం వచ్చాయి. దీంతో ఈ సినిమాను గతేడాది నవంబర్ 3న తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు.