ఢిల్లీలో వాయు కాలుష్యం నివారణకు ఆనంద్‌ మహీంద్రా సలహా

ఢిల్లీ వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా చక్కటి సలహా ఇచ్చారు. దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. చుట్టు పక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంతోపాటు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోయింది.