గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు వారం రోజుల ముందే రంగ రంగ వైభవంగా జరిగాయి. విద్యాసంస్థల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఐఎస్‌టిఎస్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి వేడుకలు అంబరానంటాయి. విద్యార్థినిలు సాంప్రదాయ దుస్తులు ధరించి ముగ్గులు, గొబ్బెమ్మలు, రంగవల్లులు, ఆటపాటలతో నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు. హిందువుల పండగల్లో సంక్రాంతి పెద్ద పండగ. మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా సంక్రాంతి పండగ అంటే ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ, గోదావరి జిల్లాలు గుర్తుకొస్తాయి. దాదాపు నెల రోజుల ముందే సంక్రాంతి పండగ సందడి మొదలవుతుంది.