అతిథి మర్యాదలకు గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. ఇంటికి వచ్చిన కొత్త అల్లుడైనా.. జిల్లాకు వచ్చిన కొత్త అధికారి అయినా ఇక్కడి మర్యాదలకు, ఆత్మీయతకు ఫిదా కాక మానరు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జేసీఐ ఇంటర్నేషనల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కేరళనుంచి రికేష్ శర్మ హాజరయ్యారు. ఇంకేముంది. రికేష్ శర్మను తమ అతిథి మర్యాదలతో అదరగొట్టేశారు స్థానికులు.