వైద్యుల నిర్లక్ష్యం ఓ యువకుడి జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఆడుకుంటూ గాయపడి ఆస్పత్రికి వెళ్లిన ఆ యువకుడికి ఆపరేషన్ చేసారు. శస్త్రచికిత్స చేసిన సమయంలో వైద్యుల నిర్లక్ష్యం ఆ యువకుడి ఆశయాన్ని దెబ్బతీసింది.. అతని తండ్రికి తీరని ఆవేదన.. అప్పులను మిగిల్చింది. ఈ దారుణ ఘటన గుంటూరు చిలకలూరిపేటలో జరిగింది. బాధితుడి తండ్రి చెప్పిన వివరాలు ప్రకారం.. చిలకలూరిపేటకు చెందిన దార్ల జోజియ్య కుమారుడు వంశీ ఇంటర్ చదువుకున్నాడు.