తెలంగాణ విద్యుత్ వినియోగ సంస్థలు TGSPDCL, TGNPDCL కీలక ప్రకటన చేశాయి. నెలవారీ విద్యుత్ బిల్లులను తమ అధికారిక వెబ్‌సైట్, యాప్‌లపై మాత్రమే చెల్లించాలని సూచించాయి. ఈ మేరకు అన్ని చెల్లింపు గేట్‌వేలు, బ్యాంకుల ద్వారా చెల్లింపులను జులై 1 నుంచి నిలిపివేసినట్టు TGSPDCL ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరణ ఇచ్చారు.