మిచౌంగ్ తుఫాను ఊళ్లకు ఊళ్లనే ముంచేసింది. తమిళనాడు, ఏపీ రాష్ట్రాలను అల్లకల్లోలం చేసింది. తెలంగాణపైనా తన ప్రభావాన్ని చూపింది. అనేక జిల్లాల్లో భారీ వర్షాలు ముంచెత్తాయి. రోడ్లు జలమయం అయ్యాయి. వాన తగ్గినా రోడ్లన్నీ బురదమయంగా మారిపోయాయి. దాంతో వాహనరాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న గిరిజన మహిళ ఆస్పత్రికి వెళ్లే మార్గం అధ్వానంగా ఉండటంతో సకాలంలో ఆస్పత్రికి చేరుకోలేక బిడ్డను కోల్పోయిన ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది.