బైకులు వదిలి గుర్రాలెక్కిన ఫుడ్ డెలివరీ బోయ్స్ Zomato Delivery Boy Food Delivery On Horse - Tv9

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ.. ప్రస్తుత కాలంలో దీనికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతాకాదు. వండుకునే సమయంలేక కొందరు, ఏం వండుకుంటాంలే రోజూతినేదే.. ఇవాళ ఏదైనా వెరీటీగా ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకుందామని కొందరు ఇలా అందరూ ఆన్‌లైన్‌ ఫుడ్‌మీద ఆధారపడుతున్నారు. ఇలా ఫుడ్‌ ఆర్డర్‌ చేయగానే ఆయా సంస్థలకు చెందిన డెలివరీ బోయ్స్‌ క్షణాల్లో ఫుడ్‌ ఆర్డర్‌ పట్టుకుని వారిముందు ప్రత్యక్షమవుతారు. ఎండైనా, వానైనా, గజగజా వణికించే చలైనా లెక్కచేయకుండా బైక్‌పై రయ్‌..య్‌..మంటూ దూసుకెళ్లి వారి ఆకలి తీరుస్తారు. మరి ఆఫుడ్‌ డెలివరీకి తనతోపాటు ప్రయాణించే బైకుకి కూడా ఫుడ్‌ కావాలికదా.. అది లేకపోతే బైకు ఎలా ముందుకు కదులుతుంది? పెట్రోలు ట్యాంకర్‌ డ్రైవర్ల సమ్మె పుణ్యమా అని పెట్రోలు కోసం బంకుల ముందు పెద్దసంఖ్యలో బారులు తీరుతున్నారు. అయినా పెట్రోలు దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. ఓ వైపు ఫుడ్‌ ఆర్డర్‌ డెలివరీ చేసే టైము అయిపోతోంది..