హైదరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రు జూ పార్క్ లో 125 సంవత్సరాల వయస్సు గల తాబేలు మృతి చెందింది. ఈ తాబేలుకు జూ పార్కులో ఎంతో ప్రత్యేకత ఉంది...రాక్షసుడు అనే పేరుగల ఈ మగ తాబేలుకు కొన్నేళ్లుగా జూ పార్క్‌తో విడతీయరాని బంధం ఉంది. ఈ శతాధిక తాబేలు కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధ పడుతోంది. ఈ క్రమంలో పది రోజులుగా ఎలాంటి ఆహారం కూడా తీసుకోవడం లేదు.