నిద్రపోయిన స్టేషన్ మాస్టర్ .. అరగంట నిలిచిపోయిన రైలు - Tv9

అసలే వేసవికాలం..ఎండలు మండిపోతున్నాయి. ఇంటినుంచి జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. వాతావరణం ఎలా ఉన్నా ఉద్యోగులు తమ విధులు తప్పక నిర్వర్తించాలి. ఇక ఈ వేసవి సమయంలో కడుపులో కాస్త ఆహారం పడగానే నిద్ర ముంచుకొచ్చేస్తుంది. అలా విధుల్లో ఉన్న ఓ స్టేషన్‌ మాస్టర్‌కి నిద్ర ముంచుకురావడంతో పాపం రైలు వచ్చిన సంగతే అతను గమనించలేదు. అరగంటపాటు పట్టాలపై ట్రైన్‌ నిలిచిపోయింది.