ఆదిలాబాద్ ను కమ్మేసిన పొగ మంచు - Tv9

ఆదిలాబాద్‌ జిల్లా ప్రకృతి అందాకు నిలయం. పచ్చని చెట్లు, జలపాతాలు, దట్టమైన అడవులు, పక్షుల కిలాకిలా రావాలతో అలరారుతూ ఉంటుంది. ఇక శీతాకాలంలో కశ్మీర్‌ను తలపించే అందాలు ఆదిలాబాద్‌ సొంతం. ఈ అందాలకు ఇప్పుడు మంచు తోడయింది. తెల్లవారుజామున కురుస్తున్న పొగమంచు చూపరులకు కనువిందు చేస్తోంది. ఆదిలాబాద్‌ జిల్లాను మంచు దుప్పటి కమ్మేసింది. పల్లెలే కాదు జిల్లా వ్యాప్తంగా దట్టంగా మంచు అలముకున్నది. ఉదయం 8 గంటలవుతున్నా పొగ మంచు కురుస్తూనే ఉన్నది.