తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వచ్చేసింది. నవంబర్ 30న ఎన్నికల జరిపి, డిసెంబర్ 3న ఫలితాలు ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారం రంగంలోకి దిగేశాయి. ముఖ్యంగా అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన అధికార పార్టీ బీఆర్‌ఎస్.. ప్రచారంలోనే అదే ఊపుతో దూసుకెళుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆ పార్టీ క్యాంపెయినింగ్ ఓ రేంజ్‌లో సాగుతోంది.