బీ అలర్ట్.. ఏపీ అధికారులు సీఎం జగన్ ఆదేశం - TV9

మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో హంసలదీవి దగ్గర బంగాళాఖాతంలో అలలు ఎగసిపడుతున్నాయి. పరిస్థితిని పర్యవేక్షించేందుకు అధికారులు నాగాయలంక, కోడూరు మండలాలకు చేరుకున్నారు. అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వేటకు వెళ్ళిన మత్స్యకారులను వెనక్కి పిలిపిస్తున్నారు. తుఫాను దృష్ట్యా పాఠశాలలకు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.